కరోనా వైరస్.. కీలక విధానాన్ని ప్రకటించిన కేంద్రం

admin
Read Time2 Minute, 8 Secondబారిన కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేసే విధానాన్ని కేంద్రం ప్రకటించింది. పేషెంట్ కోలుకున్నాక.. 24 గంటల వ్యవధిలో సేకరించిన రెండు శాంపిళ్లలోనూ నెగటివ్ రిపోర్ట్ రావాలని తెలిపింది. దీంతోపాటు చెస్ట్ రేడియోగ్రాఫిక్ క్లియరెన్స్, శ్వాససంబంధ శాంపిళ్ల క్లియరెన్స్ రావాలని స్పష్టం చేసింది. కరోనా అనుమానిత కేసుల విషయానికి వస్తే.. తొలి రిపోర్టులో నెగెటివ్ వచ్చిన వారిని డాక్టర్ సూచనల మేరకు డిశ్చార్జ్ చేయొచ్చని తెలిపింది. కానీ సోకిన వ్యక్తిని కలిసిన నాటి నుంచి 14 రోజుల వరకు పరిశీలనలో ఉంచాలని స్పష్టం చేసింది.

రాష్ట్రాల నుంచి వచ్చిన రిపోర్టుల ప్రకారం.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 115కి పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ విధానాన్ని ప్రకటించింది. దేశంలో 107 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారానికి దేశంలో 84 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకూ భారత్‌లో ఇద్దరు కరోనా వైరస్ పేషెంట్లు మరణించగా.. వీరిద్దరూ వయసు మీద పడిన వారే కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా సోకిన 107 మందిలో 10 మంది కోలుకోగా.. 95 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలోని బుల్దానాలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో చనిపోగా.. అతడికి కోవిడ్ సోకలేదని పరీక్షల్లో తేలింది.Source link

0 0
Next Post

Coronavirus | Andhra Pradesh local body polls postponed by 6 weeks

The State Election Commission (SEC) has deferred the local body elections by six weeks due to the threat of COVID-19 and decided to continue the process from where it stopped in respect of ZPTCs and MPTCs and urban local bodies after six weeks or after the COVID threat recedes whichever […]