కరోనా చిచ్చు: చైనాతో సంబంధాలు తెంచుకునే దిశగా అమెరికా.. ట్రంప్ సంకేతాలు!

APNEWS CO
Read Time3 Minute, 48 Secondచైనా, అమెరికాల మధ్య కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మొదలైన చిచ్చు క్రమంగా రాజుకుంటోంది. వైరస్ విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు చేసిన తాజాగా వ్యాఖ్యలే ఉదాహరణ. ప్రస్తుతం తనకు చైనా అధ్యక్షుడితో మాట్లాడే ఆసక్తిలేదని, ఆ దేశంతో సంబంధాలు తెంచుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్ బ్రాడ్‌కాస్ట్‌కి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టిడి చేయడంలో చైనా విఫలం కావడం తమను చాలా నిరుత్సాహానికి గురిచేసిందన్నారు.

ఈ మహమ్మారి చైనాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన వాణిజ్య ఒప్పందంపై ప్రభావం చూపుతోందన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని ఇరు దేశాల మధ్య కుదిరిన ఒక పెద్ద విజయంగా అభివర్ణించిన ట్రంప్… వాణిజ్య ఒప్పందంలో సిరా కేవలం పొడిగా ఉందని వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయి.. కానీ, ప్రస్తుతం జిన్‌పింగ్‌తో మాట్లాడే ఆసక్తి లేదన్నారు. తాము చేయగలిగినవి చాలా ఉన్నాయని, మొత్తం సంబంధాలను తెంచుకోవచ్చని ఉద్ఘాటించారు.

చైనా నుంచి అంచనా వేసిన వార్షిక దిగుమతులను ప్రస్తావించిన ట్రంప్.. ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలగితే, ఏమి జరుగుతుంది? 500 బిలియన్ డాలర్లను ఆదా చేస్తామని ట్రంప్ అన్నారు. కాగా, కరోనా వైరస్ విషయంలో తమపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు చైనా స్పందించింది. తన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌ ఎడిటర్ ఇన్ చీఫ్ హు జిన్‌జిన్ ట్వీట్ చేశారు. ‘ఈ అధ్యక్షుడు ఒకసారి కోవిడ్ -19 రోగులకు క్రిమిసంహారక మందులు వేయమని సూచించారు.. ఇది గుర్తుంచుకోండి, అతను చైనాతో ఉన్న మొత్తం సంబంధాలను తెంచుకోగలమని చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపోరు’ అని ఎద్దేవా చేశారు.

కాగా, అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్టీవెన్ మునుచిన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ గురించి చైనా నుంచి చాలా సమాచారం అందించాల్సిన అవసరం ఉందని, ట్రంప్ తన ఆప్షన్‌ను సమీక్షిస్తున్నారని తెలిపారు. ‘సహజంగానే ఈ వైరస్ ఆర్థిక వ్యవస్థపై, అమెరికన్ ఉద్యోగాలపై, అమెరికా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీనిపై ఆందోళన చెందుతున్నాం.. ఆర్థిక వ్యవస్థ, అమెరికా పౌరులను రక్షించడానికి అధ్యక్షుడు చేయాల్సింది చేయబోతున్నారు’అని మునుచిన్ అన్నారు.Source link

0 0
Next Post

COVID-19 cases in A.P. goes up to 2,307

Coronavirus is spreading in Andhra Pradesh inspite of the lockdown with 102 new cases confirmed in the last 24 hours. The number includes 57 persons who contracted the virus locally and through Koyambedu market in Chennai and 45 are migrant workers (34 from Maharashtra and 11 from Rajasthan) who returned […]