ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్నీ.. ప్రభుత్వం ఆదేశాలు

admin
Read Time3 Minute, 17 Secondఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్నిని నియమిస్తూ.. జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇటీవలే బదిలీ చేసిన ఏపీ సర్కారు.. ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో కొత్త సీఈవోగా నీలం సాహ్నిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎంవో స్పెషల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

1984 బ్యాచ్‌కు చెందిన సాహ్ని… కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవలే రిలీవ్ అయ్యారు. ఆమె 2020 జూన్ నెలాఖరు వరకు సర్వీసులో ఉండనున్నారు. నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్ నీలం సాహ్ని కావడం విశేషం.

నీలం సాహ్ని ఇటీవలే ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. నవంబర్ 4న విజయసాయిరెడ్డితో కలిసి తాడేపల్లిలో జగన్‌ను కలిసిన ఆమె.. సీఎంతో కలిసి లంచ్ చేశారని తెలుస్తోంది. ఆ తర్వాతే సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

నీలం సాహ్ని జాబ్ ప్రొఫైల్..
1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పని చేశారు.

నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.

2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం బాధ్యతలు చేపడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్, మిన్నీ మాథ్యూ మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు.Source link

0 0
Next Post

Another Telangana Transport Driver Allegedly Commits Suicide Amid Strike

Nearly 48,000 employees have boycotted work demanding pay revision among other things Hyderabad:  Another Telangana State Road Transport Corporation (TSRTC) driver allegedly committed suicide on Wednesday in Mahabubabad district as the indefinite stir by the employees’ unions entered its 40th day. The 45-year-old allegedly consumed poisonous substance at his house […]