ఏపీ అసెంబ్లీ కమిటీలు.. అంబటి రాంబాబుకి కీలక పదవి, వల్లభనేని వంశీకి కూడా..

admin
Read Time2 Minute, 36 Secondఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తాజాగా ఐదు కమిటీలను ప్రకటించారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు అవకాశం కల్పించారు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సభ్యుడిగా నియమించారు. ఎమ్మెల్యేలు చెన్నకేశవ రెడ్డి, జగన్మోహన రావు, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకా వెంకట ప్రతాప అప్పారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో అంటికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన్ను కీలకమైన ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా నియమించారని భావిస్తున్నారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం చైర్మన్‌గా రూల్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వల్లభనేని వంశీని సభ్యుడిగా నియమించారు. ఆయన పార్టీ మారుతారని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. రూల్స్ కమిటీలో ఆనం రాంనారాయణ రెడ్డి, చిన అప్పలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహీధర్ రెడ్డి, అప్పలనాయుడు సభ్యులుగా ఉంటారు.

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చైర్మన్‌గా పిటీషన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, కాసు మహేష్ రెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఏలూరి సాంబశివ రావు సభ్యులుగా ఉంటారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చైర్మన్‌గా ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మల్లాది విష్ణు, వెంకట రమణ మూర్తి రాజు, వెంకట చిన అప్పల నాయుడు, వి వరప్రసాద రావు, శిల్పా చక్రపాణి రెడ్డి, అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణ చైర్మన్‌ను నియమించారు.Source link

0 0
Next Post

Skills On Wheels Bus Takes Digital Education To Rural Areas

Various groups will be provided digital literacy for 11 hours per day. Amravati:  Andhra Pradesh State Skill Development Corporation has launched “Skills on Wheels” bus on Thursday from the corporation office in Amravati to provide digital education in rural areas of the state. The bus will travel to six districts […]