ఆస్పత్రిలో కామపిశాచి.. లేడీ డాక్టర్‌ని అసభ్యంగా తాకుతూ.. దారుణం

APNEWS CO
Read Time2 Minute, 13 Secondమహిళలపై నేరాలను కట్టడి చేసేందుకు కఠిన చట్టాలు తెస్తున్నా కామంధుల్లో మార్పు కనిపించడం లేదు. ఇంటి నుంచి బయలుదేరింది మొదలు ఎక్కడ ఎలాంటి వేధింపులు ఎదరవుతాయో తెలియని దుస్థితి. ఆఖరికి పనిచేసే చోట కూడా మహిళలకు తప్పడం లేదు. ఏకంగా ఓ లేడీ డాక్టర్‌కే అలాంటి దారుణ పరిస్థితి ఎదురైంది. నైట్ డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌ని చూసిన వార్డు బాయ్ నీచానికి పాల్పడ్డాడు. ఆమె డాక్టర్ అన్న కనీస గౌరవం కూడా లేకుండా ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

నగరంలోని ఓ ఆసుపత్రిలో ట్రైనీ లేడీ డాక్టర్‌(30)కి దారుణమైన అనుభవం ఎదురైంది. ఆమె సబార్డినేట్ సిబ్బందే లైంగిక వేధింపులకు దిగడంతో షాక్‌కి గురైంది. సదురు డాక్టర్‌పై కన్నేసిన వార్డు బాయ్ ఆమెకు నైట్‌ డ్యూటీ పడడంతో వెర్రెక్కిపోయాడు. అర్ధరాత్రి వేళ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. చేతులతో ఆమెను ఎక్కడపడితే అక్కడ అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశాడు.

Also Read:

ఊహించని పరిణామంతో లేడీ డాక్టర్ నిర్ఘాంతపోయింది. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేయడంతో వార్డు బాయ్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తన సీనియర్స్‌కి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని గజేంద్ర గోసవి(45)గా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జేజే మార్గ్ పోలీసులు నిందితుడు గజేంద్రని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Read Also:Source link

0 0
Next Post

Tourism Manager held for thrashing woman staff

Police on Tuesday arrested Tourism Hotel Deputy Manager C. Bhaskar for thrashing a female senior assistant after she reportedly asked him to wear face mask. Enraged over the Senior Assistant Usha Rani’s suggestion to him in view of growing incidence of Coronavirus, the officer allegedly pulled her by her hair […]