అప్పులకు బలైన కుటుంబం.. ముగ్గురి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో విషాదం

admin
Read Time1 Minute, 30 Secondఅప్పులు ఓ కుటుంబాన్ని మింగేశాయి. తలకు మించిన భారం కావడం.. తిరిగి తీర్చే దారి కనిపించకపోవడంతో ఓ కుటుంబ పెద్ద దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబంతో సహా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమ కూతురుతో సహా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి చేసుకున్న ఘటన జలుమూరు మండలం కొత్తపేట గ్రామంలో జరిగింది. అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువవడంతో దిక్కుతోచని స్థితిలో భార్యాభర్తలు కళావతి, శంకర్రావ్ తమ కుమార్తె గీతాంజలితో సహా పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని హుటాహుటిన నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:Source link

0 0
Next Post

coronavirus live updates : కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: రైల్లో ప్రయాణించిన 12 మందికి కరోనా వైరస్ - coronavirus news updates in andhra and telangana across india and globally in telugu

⍟ ఇటీవల రైల్లో ప్రయాణించిన 12 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. మార్చి 13న ఢిల్లీ నుంచి రామగుండానికి ఏపీ సంపర్క్ క్రాంతి రైలులో పర్యటించిన ఎనిమిదికి, మార్చి 16న గొడాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ముంబయి నుంచి జబల్‌పూర్ వెళ్లిన నలుగురు ప్రయాణికులకు వైరస్ సోకినట్టు తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు రైల్లో దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. […]