అది కరెక్ట్ కాదు.. చంద్రబాబు ముందే కుండబద్ధలు కొట్టిన అయ్యన్నపాత్రుడు

admin
Read Time2 Minute, 35 Secondఏపీలో వైఎస్ఆర్సీపీ సర్కారు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకముందే ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ఆ పార్టీ నేత నారా లోకేశ్ అయితే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అరాచక పాలన సాగిస్తోందంటూ టీడీపీ మండి పడుతోంది. అధికార పార్టీ వైఖరిని ఇక ఏమాత్రం ఉపేక్షించొద్దని టీడీపీ నేతలు భావిస్తున్నారు. జనంలోకి వెళ్లాలని, సర్కారు తీరుకు నిరసనగా రోడ్డెక్కాలని తెలుగు తమ్ముళ్లూ భావిస్తున్నారు. టీడీపీ అధినేత కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఆరు నెలల వరకు ఆగుదామనుకున్నాం.. కానీ వైఎస్ఆర్సీపీ అరాచకాలను చూశాక ఇక ఏ మాత్రం ఉపేక్షించొద్దని నిర్ణయించామని బాబు ఇదివరకే తెలిపారు.

కానీ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల మాత్రం భిన్నంగా స్పందించారు. రెండు నెలలకే ప్రభుత్వం తీరును తప్పుబడుతూ జనంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం తప్పులు చేసేదాకా వేచి చూద్దాం. సర్కారు తీరుతో జనం ఒకింత విసుగు చెందాకే జనంలోకి వెళ్దామని ఆయన టీడీపీ అధినేతకు సలహా ఇచ్చారు. మంగళవారం టీడీపీ నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమావేశంలో టీడీపీ సీనియర్ నేత, టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానని, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన పొలిట్ బ్యూరో భేటీలో అయ్యన్నపాత్రుడు భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ హయాంలో ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు వైఎస్ఆర్సీపీకే ఓటేశారని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.Source link

0 0
Next Post

70 gates in Prakasam Barrage opened to prevent flooding

Following the release of water from the Pulichintala Project, 70 gates in the Prakasam Barrage here have been lifted to prevent the possibility of flooding on Tuesday. A.M.D Imtiaz, Collector, Krishna District, who was present at the barrage to review the situation, said that the water from Pulichintala project has […]